
ఢీల్లి: ప్రధాని మోడీ గురువారం ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రూ.4200 కోట్లు విలువైన పలు అభివృద్ధికార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసగించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ పితోర్ఘడ్ జిల్లాలోని పార్వతీ కుండ్ వద్ద పరమశివుడి దేవాలయాన్ని సందర్శించి, పూజలు చేశారు. జగదేశ్వర్ ధామ్, సరిహద్దున ఉన్న గుంజీ గ్రామాన్ని, కైలాశ్ పర్వతాన్ని కూడా సందర్శించనున్నారు.