ప్రజాశక్తి-మండపేట : మండపేట నియోజకవర్గంలోని మండపేట పట్టణ, మండపేట, కపిలేశ్వరపురం మండలాలలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆదివారం పరామర్శించారు. స్థానిక 13వ వార్డుకు చెందిన బోళ్ళ వెంకట్రావు, మారేడుబాక గ్రామంలో పాలిక భీమరాజు, కాలేరులో గుణ్ణం వెంకట్రావు కుటుంబాల సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో పసలపూడి శ్రీనివాసరావు, రాయుడు గంగరాజు, చుండ్రు రామకృష్ణ చౌదరి, చింతపల్లి రామకృష్ణ, అల్లూరి రామకృష్ణ చౌదరి, తదితర్లు ఉన్నారు.










