ప్రజాశక్తి-చందర్లపాడు : చందర్లపాడు గ్రామంలో రూ.62 లక్షల అంచనా విలువతో "జల జీవన మిషన్" ద్వారా ఇంటింటికి కుళాయి పథకంలో భాగంగా చేపట్టనున్న రక్షిత వాటర్ ట్యాంకు నిర్మాణం మరియు వాటర్ లైన్ ఏర్పాటు పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు సోమవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి సురక్షితమైన మంచినీటిని అందించటమే జలజీవన్ మిషన్ లక్ష్యమని, జలజీవన్ మిషన్ ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్లు అందిస్తామని తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి తాగునీటిని సరఫరా చేయాలని కాంట్రాక్టర్లకు- అధికారులకు ఆయన సూచించారు. పైపులైన్ల ఏర్పాటు పనులను స్థానిక ప్రజాప్రతినిధులు -పార్టీ నాయకులు దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు, జడ్పిటిసి ముక్కపాటినరసింహారావు, మండల పార్టీ కన్వీనర్ కందుల నాగేశ్వరరావు ,యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ ,రాయల జానకిరామయ్య ,శాఖమూరి వెంకటకుమారి, లాల్ సా, ఎంపీటీసీ సభ్యులు కోట సత్యనారాయణ, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.










