ప్రజాశక్తి-నెల్లూరు : టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన తండ్రి ఇచ్చిన ఆస్తి కంటే ఒక రూపాయి ఎక్కువ సంపాదించలేదని స్పష్టత నిచ్చారు. తాను వెంకటేశ్వర స్వామి వద్ద ప్రమాణ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు. లోకేష్‌కు దమ్ముంటే తన సవాలును స్వీకరించాలన్నారు. లోకేష్‌కు దమ్ముంటే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలన్నారు. ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. సభలో స్టేజీ మీద నుంచి చర్చకు పిలవడం కాదని.. ఇప్పుడు చర్చకు రావాలని.. మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తానని చెప్పారు. చెప్పిన అరగంటలో తాను చర్చకు వస్తానని అన్నారు. చర్చకు సింగిల్‌గానే వస్తానని తెలిపారు. కావాలంటే లోకేష్ వెయ్యి మందితో రావచ్చని అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పిన అజీజ్‌ను ఎందుకు పక్కకు పెట్టారని ప్రశ్నించారు. బెట్టింగ్ కేసులు ఉన్నవాళ్లందరూ లోకేష్‌తోనే ఉన్నారని విమర్శించారు.










