ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : జగనన్న సురక్ష' కార్యక్రమం ద్వారా పౌరసేవలన్నీ వేగవంతంగా అందుతున్నాయని ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఉరవకొండ సచివాలయం-1 పరిధిలో నిర్వహించిన 'జగనన్న సురక్ష' కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పాలన అందించాలని ఉద్దేశంతో శక్తివంతం లేకుండా కషి చేస్తున్నారన్నారు. 11 రకాల సర్టిఫికెట్‌లు ఏవి కావాలన్నా 'జగనన్న సురక్ష' కార్యక్రమంలో ఉచితంగా అందజేస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వలంటీర్‌కు సమస్య చెబితే వెంటనే పరిష్కరిస్తామన్నారు. అనంతరం 66 మంది లబ్ధిదారులకు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, సర్పంచ్ లలిత, ఉపసర్పంచ్ వన్నప్ప, కురుబ, ఎంబీసీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్లు గోవిందు, జోగి వెంకటేసులు, వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ మీరంబాషా, మండల స్పెషల్ ఆఫీసర్ కుష్బు కొఠారి, ఎంపీడీవో చంద్రమౌళి, పంచాయతీ ఈవో గౌస్, వార్డు సభ్యులు, ఎంపిటిసిలు, కో అప్షన్ సభ్యుడు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.










