Oct 10,2023 15:51

ప్రజాశక్తి-రొద్దం(అనంతపురం) : మండలంలోని సానిపాల్లి ఎంపీ యూపి పాఠశాలలో చదువుతున్న 6,7,8 తరగతి విద్యార్థులకు ఆంగ్ల ఉపాధ్యాయురాలు లక్ష్మి నరసమ్మ మంగళవారం దాదాపు 55 మంది విద్యార్థులకు వర్క్‌ బుక్స్‌ ఉచితంగా అందించినట్లు తెలపారు. అదే విధంగా 6వ తరగతి విద్యార్థులకు గణిత ఉపాధ్యాయులు కష్ణా నాయక్‌ గణిత వర్క్‌ బుక్స్‌ ఉచితంగా అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్‌ గౌడ్‌, ఉపాధ్యాయులు నారాయణ స్వామి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్ర శేఖర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఈ పుస్తకాలు విద్యార్థులందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. నారాయణ స్వామి మాట్లాడుతూ.. విద్యార్థులకు పుస్తకాలు ఉచితంగా అందించడం ఎంతో సంతోషకారం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహన్‌ రెడ్డి, జయమ్మ, విద్యార్థులు ఎస్‌ ఎం సి చైర్మన్‌ శ్రీనివాసులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.