Oct 08,2023 16:21
  • ఆక్రమణకు గురైన సాగు భూమి కోసం పోరాడి ఓడిన రైతు

ప్రజాశక్తి- లేపాక్షి (శ్రీ సత్య సాయి జిల్లా) : లేపాక్షి మండలం కొండూరులో విషాదం చోటుచేసుకుంది. ఆక్రమించుకున్న సాగుభూమి దక్కదని మనస్థాపం చెంది వెంకటేష్‌(35) అనే రైతు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని సంవత్సరాల క్రితం కొండూరు సమీపంలో కుశ లవ ప్రాజెక్ట్‌ వారు కొండూరు, కొర్లకుంట తదితర గ్రామాల రైతులకు సంబంధించిన సాగు భూములు ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తామని ఆ ప్రాంతం బాధిత రైతులు కొన్ని రోజులుగా భూ పోరాటం చేస్తున్నారు. అయితే ఇటు అధికారులు అటు పాలకుల స్పందన లేకపోవడంతో ఆక్రమణకు గురైన భూములు దక్కే అవకాశం లేదని మనస్థాపం చెందిన వెంకటేష్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి తండ్రి తిప్పన్న భూ పోరాటం చేస్తూ నెల క్రితం మృతి చెందాడు. సాగు భూములను దౌర్జన్యంగా ఆక్రమించు కోన్నారని అధికారులు స్పందించి తమ భూముల స్వాధీన పరచాలని కొన్ని నెలలుగా మండల స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు పోరాటాలు చేస్తున్నారు. అయితే ఇంతవరకు రైతులకు న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం.