
ఐజ్వాల్ : మిజోరం శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 174 మంది అభ్యర్థుల్లో ఏకంగా 112 మంది కోటీశ్వరులే. వీరిలో అమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్రూ లాల్‌రెమ్కిమా పచావ్ అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి విలువ సుమారు రూ.69 కోట్లు. అభ్యర్థుల్లో 64.4% మంది తమకు కోటి రూపాయలు, ఆపై విలువ కలిగిన ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించారు. పచావ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.వాన్‌లాల్‌తుంగాకు రూ.55.6 కోట్ల విలువైన ఆస్తులు, జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ అభ్యర్థి హెచ్.జంజలాలాకు రూ.26.9 కోట్ల ఆస్తులు ఉన్నాయి. సెర్‌చిప్ స్థానం నుండి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి రామ్‌లున్-ఎడెనా తన చరాస్థుల విలువ కేవలం రూ.1,500 మాత్రమేనని అఫిడవిట్‌తో తెలియజేశారు.