
న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్ మరియు మిజోరాంలలో పోలింగ్ ప్రారంభమైంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు నెలరోజుల ముందు జరగనున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలకం కానున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో మొదటి దశ పోలింగ్‌లో 20స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందులో 12 స్థానాలు మావోయిస్ట్ ప్రభావితమైన బస్తర్‌జిల్లాలో ఉన్నాయి. సుమారు 60,000కు పైగా భద్రతా దళాలను మోహరించారు.
సోమవారం కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు ఐఇడి పేల్చివేశారు. ఈ ఘటనలో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. ఈ నెల 17వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశ పోలింగ్ జరగనుంది. మిజోరంలో 40 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది.