Oct 18,2023 15:56

మిజోరాం : వచ్చే నెలలో మిజోరాం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 12 మంది అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి బుధవారం విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో మిజోరాం మాజీ అసెంబ్లీ స్పీకర్‌ లాల్రిన్లియానా సైలోను మమిత్‌ నియోజవర్గం నుంచి బిజెపి బరిలోకి దింపింది. అలాగే చంపై నార్త్‌ నుంచి పిఎస్‌ జట్లుంగాకు బిజెపి టికెట్‌ ఇచ్చింది.
కాగా, మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌ 40 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నవంబర్‌ 7న మిజోరాంలో పోలింగ్‌ జరగనుంది.