
ప్రజాశక్తి-బుచ్చయ్యపేట(అనకాపల్లి) : మండలంలో జగనన్న సమగ్ర భూ సర్వే తప్పులు తడకగా ఉందన్న ఆరోపణలు సర్వత్ర వినిపిస్తున్నాయి. సర్వే ఆదరా బాదరాగా నిర్వహించడంతో పలు గ్రామాలలో రైతుల భూరికార్డులు మారిపోయాయి. దీంతో వారు లబో దీపం అంటున్నారు. జగనన్న సమగ్ర భూ సర్వేలో రికార్డులు మారిపోయాయని రాజాంకి కోనేటి రమణ అనే ఎస్టీ కులస్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రాజాం సర్వే నెంబర్ 335/4లో తనకు ఎకరా ప్రభుత్వం భూమికి 1993లో డి పట్టా ఇచ్చారన్నారు. ఈ భూమి తన సాగులో ఉందని రీ సర్వే సమయంలో నాకు ఆరోగ్యం బాగోలేక వెళ్ళ లేకపోయానన్నారు. సర్వే అధికారులు తన భూముని వేరే వ్యక్తి పేరిట నమోదు చేశారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి రికార్డులను సవరించాలన్నారు.