Sep 30,2023 14:07

ప్రజాశక్తి-రామచంద్రపురం : గ్రామీణ ప్రాంతాల ప్రజలతోపాటు పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు జగనన్న సురక్ష పథకం ఏర్పాటు చేశామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష పథకం కార్యక్రమాన్ని శనివారంప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పర్యటించి ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ద్వారా వ్యాధులు ఉన్న వారిని గుర్తించటం వారికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా జగనన్న సురక్ష క్యాంపులునిర్వహించడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైందన్నారు. ఇప్పటికే వార్డులు, గ్రామాలు వారిగా జబ్బు ఉన్న వాళ్ళ డేటాను గుర్తించడం జరిగిందని వీరికి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా జగనన్న సురక్ష శిబిరాలుదోహదపడతాయన్నారు. అనుభవజ్ఞులైన డాక్టర్లు  రోగులను వైద్య సలహాలు ఇవ్వడంతో పాటు అవసరమైన ఆపరేషన్లకు సిఫార్సులు చేస్తారన్నారు. ఈ వైద్య శిబిరాల్లో ముఖ్యంగా బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ టెస్ట్ లు చేస్తారని అత్యవసరమైన టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా లాంటి చికిత్సలకు పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ వైద్యులతో పాటు మేడికోవర్, అపోలో వంటి ప్రైవేట్ హాస్పటల్ చెందిన డాక్టర్ల సేవలను అందుబాటులో ఉంచడంజరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గాధంశెట్టి శ్రీదేవి, ఎంపీపీ అంబటి భవాని, జడ్పిటిసి మెర్నీడి వెంకటేశ్వరరావు, ద్రాక్షారామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ, ఎంపీడీవో సలట్ రాజు, పలువురు ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.