Oct 11,2023 12:43

ప్రజాశక్తి-పుంగనూరు(చిత్తూరు) : రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను పుంగనూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రైవేట్ బస్టాండ్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద మంత్రి పెద్దిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేకు కట్ చేసి ,అన్నదానం కార్యక్రమం నిర్వహించి సంబరాలను బుధవారం నిర్వహించారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్ రెడ్డప్ప మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజక వర్గం వచ్చిన తర్వాతే అన్ని రంగాల అభివృద్ధి చెందిందని చెప్పారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ హలీం భాష , మూడ చైర్మన్ ఎన్ వెంకట్ రెడ్డి యాదవ్, స్టేట్ ఫోక్ అండ్ కల్చరల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం,  వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.