న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్)లో చేరే కుటుంబాల సంఖ్య జూన్‌లో మూడేళ్ల గరిష్టస్థాయికి చేరింది. ఈ పథకం కింద వందరోజుల ఉపాధి హామీ కోసం అత్యధిక కుటుంబాలు సంతకం చేసినట్లు నివేదికలో వెల్లడైంది. 2014 ఏప్రిల్ తర్వాత ఇది మూడవసారి కావడం గమనార్హం. నెలవారీ గణాంకాల ప్రకారం.. ఉపాధి కోరే కుటుంబాల సంఖ్య మూడు కోట్లను దాటినట్లు నివేదిక వెల్లడించింది. గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ సంఖ్య 10 శాతం పెరిగి 3.04 కోట్లకు చేరింది. భారత మాజీ చీఫ్ స్టాటిస్టిషియన్ ప్రణబ్ సేన్, ఇండియా రేటింగ్స్‌లో చీఫ్ ఎకనామిస్ట్ దేవేంద్ర కుమార్ పంత్ ఉన్నారు.
నివేదిక ప్రకారం.. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌లో చేరే కుటుంబాల సంఖ్య కేవలం రెండు సార్లు మాత్రమే మూడు కోట్ల గరిష్ట సంఖ్యను దాటింది. 2020 మేలో 3.3కోట్లు కాగా, కరోనా లాక్‌డౌన్ సయయం 2020 జూన్ లో 3.89 కోట్లకు చేరింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా వచ్చిన ఆదాయ నష్టాన్ని 20 శాతం మరియు 80 శాతం మధ్య భర్తీ చేయడానికి ఈ పథకం కింద పొందిన వేతనాలు సహాయపడతాయని గతేడాది ఓ అధ్యయనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
కరోనాతో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తీవ్రతరం కావడం, కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సకాలంలో నిధులు విడుదల చేయడం ఈ పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం బలహీన రుతుపవనాల కారణంగా ఖరీఫ్ సీజన్‌పై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు. పది రాష్ట్రాల్లో పదిలక్షలకు పైగా కుటుంబాలు ఈ పథకం కింద లబ్థి పొందుతుండగా, తమిళనాడు అత్యధిక వాటాను కలిగివుంది.
మరోవైపు, మోడీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లలో ఈ పథకానికి నిధుల కేటాయింపును తగ్గిస్తోంది. ఈ ఏడాది కేవలం రూ. 60వేల కోట్లను మాత్రమే కేటాయించింది. ఎఫ్‌వై 23 కోసం 73వేల కోట్ల బడ్జెట్ అంచనా నుండి.. సవరించిన అంచనా రూ.89,400 కోట్లుగా ఉన్నప్పటికీ.. కేవలం రూ.60 వేల కోట్లను మాత్రమే కేటాయించడం గమనార్హం.










