ప్రజాశక్తి-పిట్టలవాని పాలెం : ఛందోలు గ్రామానికి చెందిన సయ్యద్ ఫిసల్ నియాజ్(గన్ పంతులు మనుమడు) షూటింగ్ విభాగంలో పతకాలు సాధించాడు. ఆంధ్రప్రదేశ్ రైఫెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 23వ ఛాంపియన్ షిప్ విజయవాడలో లేమన్ ట్రీ ప్రీమియర్ లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడలు 10మీటర్ల షూటింగ్ లో కాంస్య పతకం, 25 మీటర్ల విభాగంలో రజత పతకం సాధించాడు. ఈ పతకాలు రావటంతో ఛందోలు గ్రామ కీర్తి ఉన్నత స్థానంలో నిలిచింది అని పలువురు ప్రముఖులు సయ్యద్ ఫిసల్ నియాజ్ కు అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతం లో జన్మించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన కుటుంబం నుండి ఒచ్చిన వ్యక్తి క్రీడలలో రణించి తన గ్రామ కీర్తి దేశ దశ దిశలా తెలిసే లా పతకాలు సాధించాడు అని గ్రామంలో సంబరాల వాతావరణం నెలకొంది. గెలిచిన పతకాలను షూటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చేతుల మీదుగా అందుకున్నాడు.










