Jan 20,2023 15:54

ప్రజాశక్తి మైలవరం : రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో మైలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు రజిత పథకాలు సాధించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ శ్రీరామ్ మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఈనెల 18,19 తేదీలలో నంద్యాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో జరిగిన అండర్-19 ఫెన్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో తమ కళాశాల విద్యార్థులు డి. సీతయ్య, బి.రిషి నాయక్ లు పాయిల్ విభాగంలో కనబరచిన ప్రతిభకు రజిత పథకాలు సాధించారు అన్నారు. పథకాలు సాధించిన వీరిని అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, అభినందించారు.