
జమ్ము : ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు వస్తున్న ప్రదేశాన్ని సందర్శించడానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, పిడిపి నాయకురాలు మెహబూబా ముఫ్తిని స్థానిక అధికారలు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ముఫ్తి ట్వీట్ చేశారు. 'రాంబియారా నల్లాను సందర్శించకుండా స్థానిక అధికారులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో అక్రమ టెండర్ల ద్వారా ఇసుక వెలికితీతను బయటివారికి అప్పగించారు. స్థానికులను ఈ ప్రాంతం నుంచి నిరోధించారు. మా భూమి, వనరులను భారత ప్రభుత్వం దోచుకుంటుంది. భారత ప్రభుత్వానికి మా మీద ధిక్కారం తప్ప మరొకటి లేదు' అని ముఫ్తి ట్వీట్ చేశారు.