
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ (పిడిపి) అధ్యక్షులుగా మెహబూబా ముఫ్తీ మరోసారి ఎన్నికయ్యారు. గురువారం శ్రీనగర్‌లోని పార్టీ ప్రధానకార్యాలయంలో వాయిస్ ఓట్ ద్వారా జరిగిన ఎన్నికల్లో జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, 64 ఏళ్ల ముఫ్తీని పార్టీ సీనియర్ నాయకులు ఎన్నుకున్నారు. మూడేళ్ల పాటు ఆమె ఈ పదవిలో ఉంటారు. గురువారం ఎన్నికల్లో ముఫ్తీ పేరును పార్టీ ఉపాధ్యక్షులు అబ్దుల్ రెహ్మన్ ప్రతిపాదించగా, పార్టీ ప్రధాన కార్యదర్శి గులామ్ నబీ లోన్ హంజురా మద్దతు ఇచ్చారు. పిడిపి అధ్యక్షులుగా ముఫ్తీ ఎన్నిక కావడం ఇది వరసగా నాలుగోసారి.