
ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్ : ఇంకొల్లు మండలం గంగవరం బాలల విద్య విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గణిత శిక్షణా శిబిరాన్ని హైదరాబాదుకు చెందిన రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీరు కె.యల్ కాంతారావు బుధవారం ప్రారంభించారు. మంచాల రంగయ్య, రమణమ్మ కళ్యాణ మండపంలో తంగా అంజయ్య
మాష్టారు స్మారకార్ధం 9, 10 తరగతుల విద్యార్ధులకు ఈ శిక్షణా ఎంతో దోహదపడుతుందన్నారు. తొలుత అంజయ్య చిత్రపటానికి అతిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఏ.వి సుబ్బారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లెలిన్, గణిత
ఉపాధ్యాయులు షేక్ బడేసా, సి.ఐ.టి.యు రాష్ర్ట నాయకులు వై.సిద్దయ్య, బాపట్ల జిల్లా రైతు సంఘం నాయకులు కందిమళ్ళ రామకోటేశ్వరరావు,
సి.పి.ఎం పార్టీ చీరాల డివిజన్ కార్యదర్శి ఎన్.బాబూరావు, సైన్స్‌టీచర్ టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.