ప్రజాశక్తి - రాజమహేంద్రవరం 'మహిళల ఆర్థికాభివృద్ధికి కుట్టు శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని స్త్రీ, శిశుసంక్షేమశాఖ విశ్రాంత అధికారిణి ఆర్.సీతారామలక్ష్మి అన్నారు.' స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణంలో 18 మంది ఉచిత కుట్టు శిక్షణ అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందించారు. అనంతరం జరిగిన సభకు సంస్థ నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ మహిళల చదువు సంపాదన ఇంటికి ఎంతో ఉపయోగకరమన్నారు. మహిళలకు కుట్టు, కంప్యూటర్ ఉచిత శిక్షణతోపాటు ఉన్నత చదువుల కోసం ప్రోత్సహిస్తున్న స్వర్ణాంధ్ర రాంబాబును ఆమె అభినందించారు. కొత్త బ్యాచ్ కుట్టు, కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి జి.గంగాధర్ తెలిపారు. ఈనెల 18వ తేదీ నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుందన్నారు. ఇతర వివరాలకు లాలాచెరువులోని స్వర్ణాంధ్రలో కానీ, లేదా 9849847489, 0883-2447489లో కానీ సంప్రదించొచ్చన్నారు. ఈకార్యక్రమంలో కుట్టు శిక్షణ టీచర్ బి.దుర్గాదేవి, దాతలు ఎ.లక్ష్మి భవాని, దివ్యదేవి, శ్రీవాణి, సోనియా పాల్గొన్నారు.










