ప్రజాశక్తి-యు.కొత్తపల్లి (కాకినాడ) : సోలార్ మిషన్ ద్వారా ఎండు చేపల తయారీ విధానాన్ని ఉప్పాడ మహిళా సమైక్య కార్యాలయంలో మచ్చికర మహిళలకు శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఫిష్ ప్రాసెసింగ్ ఆధ్వర్యంలో ఉప్పాడ మత్స్యకార మహిళా సమైక్య కార్యాలయంలో జోనల్ ఆఫీసర్ మారుతి ఆధ్వర్యంలో ఇటీవల మహిళా సంఘ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్ అనంతరం శనివారం ఉప్పాడ మత్స్యకార మహిళా సమైక్య ప్రాంగణంలో సోలార్ డ్రాయర్ ఎండు చేప తయారీ యంత్రాన్ని తీసుకొచ్చి మత్స్యకారులకు అవగాహన కల్పించారు. ఈ సోలార్ డ్రాయర్ యంత్రాన్ని కొన్ని రోజులపాటు సమైక్య ప్రాంగణంలో ఉంటుందని సమైక్య కోఆర్డినేటర్ సిరంగి శ్రీధర్ తెలిపారు. ప్రతిరోజు సోలార్ డ్రాయర్ ద్వారా ఎండు చేప తయారీ విధానాన్ని తెలుసుకోవచ్చు అన్నారు. మత్స్యకార మహిళలు పచ్చి చేపలు తీసుకువచ్చి సోలార్ డ్రాయర్ యంత్రం ద్వారా ఎండు చేపలను ఆరబెట్టుకుని ఈ యంత్రం ద్వారా అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఎండు చేపల తయారీ విధానాన్ని తెలుసుకోవచ్చని కోఆర్డినేటర్ శ్రీధర్ తెలియజేశారు. సోలార్ డ్రాయర్ ద్వారా ఎండు చేప తయారీ నాణ్యంగా ఉంటుందని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొలుత ఉప్పాడ మహిళా సమైక్య కార్యాలయంలోనే సోలార్ మిషన్ ద్వారా ఎండు చేపల తయారీ విధానాన్ని ప్రారంభించామని శ్రీధర్ తెలిపారు.










