Oct 08,2022 12:53

బాపట్ల : పసి వయసు నుండే బాలల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ వినూత్న రీతిలో శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ''స్టూడెంట్స్‌ ఇంటలెక్చువల్‌ ఫోరమ్‌'' కఅషి అభినందనీయమని ప్రముఖ న్యాయవాది, ధృతి సంస్థ అధ్యక్షులు కళ్ళం హరినాథరెడ్డి అభినందించారు. ప్రముఖ అబ్జర్వేషనల్‌ సైకాలజిస్ట్‌ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ నేతృత్వంలో నడపబడుతున్న ''స్టూడెంట్స్‌ ఇంటలెక్చువల్‌ ఫోరమ్‌'' సంస్థ కరపత్రాన్ని ధృతి అధ్యక్షులు కళ్ళం హరినాథరెడ్డి, కార్యదర్శి చాపల సుబ్రహ్మణ్యం, తదితరులు శనివారం ఆవిష్కరించారు. ఈ తరంలో '' మేము ప్రత్యేకం '' అనే నినాదంతో బాపట్ల సాధన హై స్కూల్‌ ఆవరణలో కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమం కేజీ నుండి పీజీ వరకు చదివే ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుందని ఆడిటర్‌ చాపల సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో హై కోర్టు న్యాయవాది లీల ప్రసాద్‌ పాల్గొన్నారు.