ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : స్థానిక మారేడుబాక రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి.కె.వి శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ... దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 56,000 రూపాయలతో ఎనిమిది కుట్టు మిషన్లు ఏర్పాటు చేశామన్నారు. గార్మెంట్ టెక్నాలజీలో భాగంగా ఈటిచ్చింగ్ కోర్సు ప్రారంభించామన్నారు. దీనికోసం కళాశాల సమయం కంటే ఒక గంట ముందే అధ్యాపకులు వస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా త్వరలో స్కిల్ డవలప్‌మెంటు కోర్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.










