బోడుప్పల్: ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు ఆయుశ్మాన్ భవ కార్యక్రమం ద్వారా చేయించుకోవాలని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. బుధవారం బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య మేళా కార్యక్రమాన్ని మేయర్ సామల బుచ్చిరెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు. రోజువారి పరీక్షలు, మందులు ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం సేవల్ని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ రవి , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.