ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఆయుష్మాన్ భారత్, వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల నమోదు, పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 30 వరకు నమోదు ప్రక్రియ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఒ.. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. కార్డుల పంపిణీ పూర్తి చేసిన అనంతరం ఆయుష్మాన్ గ్రామ పంచాయతీ/ ఆయుష్మాన్ అవార్డును ప్రకటించాలని పేర్కొన్నారు. 2011 ఎస్‌ఇసిసి డేటా ఆధారంగా 1.94 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులు ఉండగా, అందులో ఇప్పటి వరకు 1.31 లక్షల మంది మత్రమే నమోదు చేసుకున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. మిగిలిన 63 లక్షల మంది లబ్ధిదారులను డ్రైవ్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.