Aug 10,2023 20:56

కరెంట్‌ వైరు తొలగిస్తున్న సుబ్బన్న

 ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) ; ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడి తన మానవత్వాన్ని చాటు కున్నారు ట్రాఫిక్‌ ఎఎస్‌ఐ సుబ్బన్న. స్థానిక గాంధీ రోడ్డులో గురువారం ఒక వృద్ధుడు సైకిల్‌పై వెళుతుండగా ఫిట్స్‌ వచ్చి వర్షపు నీటిలో పడిపోయాడు. మార్నింగ్‌ వాక్‌లో ఉన్న ట్రాఫిక్‌ ఎఎస్‌ఐ సుబ్బన్న వెళ్లి చూడగా, కరెంట్‌ వైర్‌ తెగి ఉండడాన్ని గమనించి కర్రతో దాన్ని పక్కకు తొలగించారు. అనంతరం వృద్ధునికి సపర్యలు చేసి వారి బంధువులను పిలిపించి అప్పజెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఒక ప్రాణాన్ని కాపాడిన సుబ్బన్నను ఎస్‌పి అన్బురాజన్‌ అభినందించారు.