హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వాహనం చోరీకి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం కేపీహెచ్‌బీ పరిధిలో బైక్‌ను దుండగుడు అపహరించాడు. దీనిపై వాహన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో గత రాత్రి మాదాపూర్ పోలీసులు నిర్వహస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో బైక్‌తో సదరు దొంగ పట్టుబడ్డాడు. వెంటనే వాహనాన్ని జప్తు చేసిన పోలీసులు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా... ఎవరు లేని సమయంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి దుండగుడు బైక్‌కు దొంగిలించి పారిపోయాడు. ఉదయం బైక్ యజమానికి ఫోన్ చేసి మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా పోలీసులు కోరారు. పోలీస్ స్టేషన్ వచ్చి చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో బైక్ యజమాని, పోలీసులు కంగు తిన్నారు.










