ప్రజాశక్తి - పెందుర్తి (విశాఖపట్నం) : తమకు న్యాయం చేయలేదంటూ ఆగ్రహించిన ఓ మహిళ పోలీస్ స్టేషన్ గేటుకు తాళం వేసి నిరసన తెలిపింది. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితు రాలు ఎస్.గౌతమి కథనం ప్రకారం.. కృష్ణరాయ పురంలో ఓ అపార్టుమెంట్‌లోని ప్లాట్‌ను రూ.15 లక్షలకు కొనుగోలు చేసే క్రమంలో ఐదు లక్షలను అడ్వాన్స్‌గా ఇచ్చారు. కొన్ని వస్తువులను ప్లాట్‌లో పెట్టారు. బిల్డర్ వచ్చి తనకు ఏ డబ్బులూ ఇవ్వలేదని, తాను ఏ పేపర్ మీదా సంతకం పెట్టలేదని సామాన్లు బయటపడేశాడు. పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. వారం రోజులుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని వాపోయారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తాళం వేశారు.










