Aug 09,2023 12:35

రాయదుర్గం (అనంతపురం) : రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న మారెన్న (38) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. నిన్న రాత్రి గస్తీ విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో గమనించిన తోటి సిబ్బంది వెంటనే హోంగార్డును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలిపారు. ఇదివరకు కళ్యాణదుర్గం పోలీస్‌ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మారెన్న నాలుగు రోజుల క్రితమే రాయదుర్గంలో చేరారు. మారెన్న మృతి విషయం తెలుసుకున్న కళ్యాణ దుర్గం డిఎస్పి శ్రీనివాసులు రాయదుర్గానికి వచ్చి మారెన్న మృతదేహానికి నివాళులర్పించారు. మారెన్నకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. మారెన్న మృతితో అతడి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మారెన్న మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.