హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని తూప్రాన్‌పేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ వైపు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. తూప్రాన్‌పేట నుంచి కోయలగూడెం వరకు వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో ట్యాంకర్‌ను పక్కకు తొలగిస్తున్నారు. ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో మరోవైపు నుంచి వాహనాలను పంపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.










