
లాస్ఏంజెల్స్ : అమెరికాలో మొట్టమొదటి మంకీపాక్స్ మరణం సంభవించింది. ఈ విషాయానిు లాస్ ఏంజెల్స్ కౌంటీ ఆరోగ్య శాఖాధికారులు, అమెరికా వ్యాధి నియంత్రణా కేంద్రం (సిడిసి) ధృవీకరించింది. రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిను స్థితిలో రోగి ఆస్పత్రిలో చేరారని, అంతకుమించి ఇతర సమాచారానిు బహిర్గతం చేయబోమనిఅధికారులు తెలిపారు. తీవ్రంగా రోగనిరోధక శక్తి క్షీణించి ఇబ్బంది పడుతును వ్యక్తులు ఆలస్యం చేయకుండా సత్వరమే వైద్య సంరక్షణలో వుండాలని కోరారు. గత నెల్లో టెక్సాస్‌లో ఇదే వ్యాధితో బాధపడుతును వ్యక్తి మరణించినా, ఆ మృతిలో వైరస్ పాత్రపై స్పష్టత రాలేదు. అందువల్ల అమెరికాలో ఇదే తొలి మంకీపాక్స్ మరణంగా నమోదైంది. ఇప్పటికి దేశంలో 22వేలకుపైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయనిజాతీయ గణాంకాలు తెలియచేస్తునాుయి. ప్రపంచవ్యాప్తంగా ఇదొక ఆందోళన కలిగించే పరిస్థితిగా మంకీపాక్స్ విస్తరిస్తోంది.