Jan 23,2023 15:31

ప్రజాశక్తి-నర్సీపట్నం : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నర్సీపట్నంలోని పెద్ద బొడ్డేపల్లి లో ఉన్న నిరాశ్రయ వసతి గృహం నందు మాజీ వార్డు సభ్యుడు, జిల్లా తెలుగు యువత మాజీ ఉపాధ్యక్షుడు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పళ్ళు, రొట్టెలు నిరాశ్రయులైన పేదలకు పంపిణీ  చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈరోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి నారా లోకేష్ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని మరియు ఈ నెల 27వ తారీకున లోకేష్ చేపట్టబోయే యువగలం పాదయాత్ర విజయవంతం కావాలని నర్సీపట్నం నియోజవర్గంలో మాజీ మంత్రి అయ్యన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడాలని, మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని  కోరుకున్నారు అని అన్నారు. లోకేష్ ఆయురారోగ్యాలతో జీవించాలని ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు. నారా లోకేష్  పాదయాత్ర విజయవంతంగా సాగాలని జనవరి 27న ప్రారంభమయ్యే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ "యువగళం" పేరుతో కుప్పం నుండి ఇచ్చాపురం వరకు 400 రోజులు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా సాగాలని సాగాలని అన్నారు. అంతే కాకుండా నర్సీపట్నం నియోజవర్గంలో 2024లో జరగబోయే ఎలక్షన్లలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుని మనమందరం కూడా గెలిపించుకుని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడుని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా అన్నారు. నారా లోకేష్ చేస్తున్న యాత్ర యువత భవిష్యత్తు కోసం భవిష్యత్తు తరాల భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగపడుతుందని మనమందరం కూడా లోకేష్ వెంట నడిచి ఆయనకి సంఘీభావం తెలియజేయవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మీరు ఇబ్బందుల్లోకి నెట్టివేశారు, ఉద్యోగస్తులకు హామీలు ఇచ్చారు ఎన్నో మోసాలు చేశారు. యువతకు 2 లక్షల 33 వేల ఉద్యోగాలు ఇస్తానన్నారు ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు, నమ్మించి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ముంచేశాడు. నీ ప్రభుత్వ అసమర్ధత వలన ఇబ్బందులు పడుతున్న ఉద్యోగస్తుల కుటుంబాలు, నిరుద్యోగ యువత, వారి కుటుంబ సభ్యులు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, రైతు కూలీలు భాగస్వామ్యం అవుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారు, మైనారిటీ, కాపు లోన్లు దారి మళ్ళించారు, ఆ బాధిత కుటుంబ సభ్యులు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి నాని, దేవి సంతోషి మాత ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.