పిల్లాడు
పాలు తాగుతున్నాడు
అప్పుడప్పుడు
చనుమధ్యరేఖలో
వేలు పెట్టి వృత్తాల్ గీస్తున్నాడు
లేత సూర్యకాంతి పెదాల నాడు
నేను అలానే తాగి ఉంటాను
చనుబాల జల్లులో తడిసే ఉంటాను
ఆ బతికిన క్షణాల్లో
మందారపూల రంగు పెదవులు
ఆకలైన ప్రతిసారీ పిట్టల్లా ఎగిరి
చనుకొమ్మల మీద వాలిపోయేవి
కాలం గడిచే కొద్దీ
నేను మగవాడ్ని అయిపోయి
సగాన్ని తక్కువగా చూడటమే
జీర్ణం కావడం లేదు
పాలు తాగే పసివాడి చెవుల దగ్గరకెళ్లి
'ఆమె నీకు పాలు కాదు
ప్రాణమిస్తోందని చెప్పాలని ఉంది.'
- డాక్టర్ సుంకర గోపాలయ్య
94926 38547










