ప్రజాశక్తి-నందిగామ : నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు . అవనిగడ్డలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బోరుపర్తి శ్రీనివాసరావుపై దాడికి నిరసనగా నందిగామ న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో నందిగామ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బొబ్బెళ్లపాటి భాస్కరరావు, కార్యదర్శి పి ప్రకాష్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ ఆజాద్, పవన్ కుమార్ దివ్య, సీనియర్ న్యాయవాదులు సాంబశివరావు యాదవ్, టీ ప్రభాకర్ రావు, బాబు విద్యాసాగర్, సి.హెచ్ శివరామకృష్ణ, లక్ష్మినారాయణ, వజ్రయ్య, విజయ్ కుమార్, జవహర్ బాబు, కోట రాజు, అప్పాజీ, క్రాంతి, బి సురేష్, రాంబాబు, ప్రబోజి, కోటేశ్వరరావు, డి కోటేశ్వరరావు, వల్లేపు రవి, వేల్పుల కిషోర్ తదితరు న్యాయవాదులు పాల్గొన్నారు.










