Apr 17,2023 14:57

ప్రజాశక్తి- నందిగామ : విజయవాడ హైకోర్టు న్యాయవాదులైన సుంకర రాజేంద్రప్రసాద్ గొట్టిపాటి రామకృష్ణ , జాడ శ్రవణ్ కుమార్ లను  ఏపీ సి ఐ డి పోలీసులు 160 సీఆర్పీసీ క్రింద నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరించారు. సిఐడి పోలీసుల కక్షపూరిత చట్ట వ్యతిరేక చర్యలను ఖండించాలని నిరసన తెలిపారు. ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడినాయని సీనియర్ న్యాయవాదులు బొందలపాటి రామకృష్ణ , డివిఆర్  కే జీవరత్నం పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రెటరీ పీ ప్రకాష్, వైస్ ప్రెసిడెంట్ బొబ్బిలిపాటి భాస్కర్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ షేక్.ఆజాద్ మరియు న్యాయవాదులు రామచంద్ర రెడ్డి, వజ్రయ్య  శివరామకృష్ణ, ఫణి, సుబ్రహ్మణ్యం, పుర్నేష్, సుమన్, విజయ్, అప్పాజీ, రవి  కిషోర్, రామారావు, రంగారావు, లక్ష్మీకాంత్  మహిళా న్యాయవాదులు  ప్రమీల, లక్ష్మీ దుర్గ, క్రాంతి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.