Sep 29,2022 10:49

ప్రజాశక్తి-దేవరాపల్లి: దేవరాపల్లి మండలంలోని, మారేపల్లి రెవెన్యూ సర్వే నెంబరు 115లో 23,15 సేట్లు దురక్రమణకు గురై అయిన దేవుని భూమిని రక్షించడంలో కంచె చేనుమేసినట్లుగా మామూళ్లు మత్తులో దేవదాయశాఖ అధికారులు నిద్రపోతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు గురువారం అయిన ఓప్రకటన విడుదల చేసారు. డీప్యూడి సిఎం సోంత గ్రామానికీ.చేందిన వ్యక్తులు తప్పుడు రికార్డులు స్రుష్టించి దేవుని మాన్యాన్ని అమ్మేసారని తెలిపారు. కోనుకున్న వ్యక్తులు, విచ్చలవిడిగా అక్రమ లేఆవుట్ లు వెసుకోని కోట్లాది రూపాయలకు అమ్మకాలు చేపాడుతూ ఉంటే మామ్మూళ్ళుకు కక్కుర్తి పడి దేవదాయశాఖ అధికారులు పట్టీపట్టనట్టు వ్వహరించడం అత్యంత దుర్మార్గామన్నారు. పూర్వం ఈ భూమి సేటిల్ మెంట్ అవ్వక ముందు అవుగడ్డ సకూరినాయుడు ధర్మకర్తగా ఉన్నారని, 1956 తరువాత సేటిల్ మెంట్ అయిన తరువాత సేటిల్ ఫేయిర్ అడంగల్ లో శ్రీరాములు దేవస్థానం పేరున నమోదు అయ్యిందని తెలిపారు. దీన్ని ఆప్పటికే శీస్తులకు, దున్నంకుంటున్న తారువా గ్రామానికి చేందిన వ్యక్తులు, తప్పుడు రికార్డులు స్రృష్టించి అమ్మేసారని తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతం దేవుని మాన్యాన్ని కోనుగోలు చేసిన వ్యక్తులు దేవరాపల్లి తహశీల్దార్ వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు కొరకు ధరఖాస్తు చేసుకోనగా దేవరాపల్లి తహశీల్దార్ RC.NO 100/2022 తేదీ.19/5/2022న ఈ భూమి సేటిల్ మెంట్ ఫేయిర్ ఆడంగల్ ప్రకారం దేవుని మాన్యంగా ఉందని పాస్ పుస్తకాలు ఇవ్వాలంటే దేవదాయ శాఖ అధికారులు నుండి క్లీరెన్సు కావాలని దేవదాయ అస్టేంటు కమీషనర్ అనకాపల్లి వారికి వ్రాయడం జరిందని తెలిపారు. దీనిపై RC.NO 4/2022 A 14/6/2022న దేవదాయశాఖ అధికారులు ఇది దేవుని మాన్యంగా శ్రీ రాములు వారి దేవస్థానం భూమిగా ఉందని ఈభూమికి ఎటువంటి పట్టాదారు పాస్ బుక్కులు కోనుగోలు దారునికి ఇవ్వడానికి వీలులేదని భూమి కోనుగోలు చేసిన వ్యక్తులు, వారికి భూమిపై ఎటువంటి హక్కులు ఉన్న ట్రిబ్యునల్ కి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాలని గతంలో భూములు అమ్మిన వ్యక్తులకుగాని, కోనుకున్న వ్యక్తులకు గాని ఎటువంటి అధికారం ఈభూమిపై లేదని స్పష్టం చేస్తూ, దేవదాయశాఖ అస్టేంటు కమీషనర్ అనకాపల్లి వారు దేవరాపల్లి తహశీల్దార్ వారికి వ్రాస్తు, శ్రీ రాములు వారి దేవస్థానం పేరున పాస్ పుస్తకాలు ఇవ్వాలని ధరఖాస్తు పెట్టి చేతులు దులుపుకొన్నారని తెలిపారు. దింతో తహశీల్దార్ పట్టాదారు పాస్ పుస్తకాల కోసం ధరఖాస్తు పెట్టుకున్న దురఆక్రమణ దారుడు అయిన వ్యక్తికి తహశీల్దార్ పాస్ పుస్తకాలు తిరష్కరించారని తెలిపారు. వీటి ఆధారంగా ఇది దేవుని మాన్యంగా రుజువు అయ్యిందని, కాబట్టి దేవదాయ శాఖఅధికారులు వెంటనే అక్రమణకు గురైన దేవుని మాన్యాన్ని స్వాధీనం చేసుకోవలసి ఉండగా మీనమేషాలు లెక్కపెడుతున్నారని తెలిపారు. అయితే గతంలో ఈభూములను శీస్తులకు దున్నుకున్న వ్యక్తులు తప్పుడు రికార్డులు స్రుష్టించి 1999, 2000 సంవత్సరంలో విశాఖపట్నం మున్సిపల్ సివిల్ జడ్జి కోర్టు నందు కేసు వేసారని నాడు సివిల్ జడ్జి కోర్టు దేవదాయ శాఖ దర్మదాయశాఖకు అనుకూలంగా తీర్పు నివ్వడం జరిందన్నారు. తీర్పుకు సంభందించిన పైల్ ఆక్రమణదార్లు వారి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కోర్టులో గాని దేవదాయశాఖ కార్యాలయంలో లేకుండా మాయం చేసారని తెలిపారు. 
ఇప్పుడు డిప్యూటీ సిఎం, వత్తిళ్ళుకు తలవగ్గి భూమిని స్వాధీనం చేసుకోలేకపోతున్నామని దేవదాయశాఖ అధికారులు చేప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. లేఆవుట్ దారుడు డిప్యూటీ సిఎం పేరును వాడుకుంటున్నారని స్పష్టంగా అర్దమోతుందని అన్నారు. దేవుని భూమిని రక్షించడంలో ఎటువంటి వత్తిళ్ళుకు తలవగ్గిన మామూళ్లు మత్తులో నిద్ర పోయిన దేవదాయశాఖ అధికారులు తమ ఉద్యోగాలు పోగోట్టుకోవడం ఖాయమన్నారు. వెంటనే భూమిని స్వాధీనం చేసుకునీ రక్షణ కల్పించాలని వెంకన్న డిమాండ్ చేసారు.