- మారేపల్లి దేవుని మాన్యాన్ని 22A1(C)రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి
- దేవుని మాన్యాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలి సిపిఎం డిమాండ్
ప్రజాశక్తి-దేవరపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం, మారేపల్లి రెవెన్యూ సర్వే నెంబరు 115 లో కోట్లాది రూపాయలు విలువ చేసే 23 ఎకరాల 15 సెంట్లు దేవుని భూమి దురాక్రమణకు గురైనా. భూమిని రెవెన్యూ రికార్డుల్లో 22 ఎ1 (సి) లో నమోదు చేసి భూమిని వెంటనే స్వాదీనం చేసుకోవాలని అదికారం ఉంటే దేవుని భూముని అమ్మేస్తారా! సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న ప్రశ్నించారు. బుధవారం అయిన ఓప్రకటన విడుదల చేసారు. ఈభూమి పూర్వం శిస్తులకు దున్నుకున్న వ్యక్తులు దీనిపై హక్కులు కల్పించాలని,1999లో విశాఖపట్నం మున్సిపల్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించగా ఆక్రమణ దార్లుకు ఈ భూమి చెల్లుబాటు కాదని ఆక్రమణదార్లు వేసిన పిటిషన్ కోర్టు కొట్టువేసింది. ఇనేళ్ళు కనుమరుగైన జడ్జిమెంట్ కాపీ బయటపడింది. 10 (1) రికార్డుల్లోను, సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్లోను దేవుని భూమిగా వుంది. దీనిని ఆక్రమణదారులు రికార్డుల్లో వారి పేర్లును చేర్చుకొని ఆక్రమణకు గురిచేశారు. దీనిపై దేవదాయశాఖ అధికారులు ఈ జడ్జిమెంట్ కాపీని దేవదాయశాఖ అధికారులు రెవెన్యూ అధికారులకు ఇస్తూ మారేపల్లి శ్రీరాములు వారి దేవస్థానం పేరున పాస్ బుక్కు ఇవ్వాలని ధరఖాస్తు పెట్టారు. రెవెన్యూ అధికారులు తాత్సారం చేయకుండా వెంటనే శ్రీరాములు వారి దేవస్తానం పేరున పాస్ బుక్కులు వెంటనే ఇవ్వాలి. భూమి సెటిల్ మెంట్ కు ముందు కూడా 10 (1)లో ఈభూమి మారేపల్లి గ్రామానికి చెందిన ఆవుగడ్డ స ఖూరినాయుడు ధర్మకర్తగా రికార్డుల్లో నమోదు అయ్యి ఉన్నది 1956 లో భూమి సెటిల్ మెంట్ అయిన తరువాత మారేపల్లి శ్రీ రాములు వారి పేరున నమోదై యున్నది. దీన్ని తారువ గ్రామానికి చెందిన వ్యక్తులకు ఏవిధంగా దఖలు పడిందన్నదే ప్రశ్న? ఆక్రమణ దారునికి ఈ భూమి పై ఎటువంటి అధికారాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ ఎండోమెంటు ట్రిబ్యునల్క్ వెళ్ళాలని, భూములు అమ్మిన వ్యక్తులు గాని, కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి గాని ఎటువంటి పాస్ బుక్కలు ఇవ్వరాదని స్పష్టం చేస్తూ గతంలో ఉన్న అనకాపల్లి దేవదాయశాఖ అస్టేంటు కమీషనర్ తేదీ 14/6/2022న దేవరాపల్లి తహశీల్దార్ వారికి వ్రాయడం జరిగింది. దీని ఆధారంగా తహశీల్దార్ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇప్పటికే మూడు సార్లు పాస్ బుక్కలు తిరస్కరించారు.
ఆంధ్రప్రదేశ్ ఎండోమెంటు చట్టం లోని సెక్షన్ 81 ప్రకారం ఎదైనా మతపరమైన ఆస్తి అమ్మక మునకు లేదా ఆక్రమణకు చెల్లదని ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు ఫుల్ బెంచ్ రిఫరెన్స్ లో ఉదహరించిన తీర్పు లో ధార్మిక మరియు మతపరమైన ఎండోమెంటు యొక్క స్థిరమైన ఆస్తులు సెక్షన్ 43 ప్రకారం, ఆక్రమణదారునికి హక్కులు ఉంటే ఎండోమెంటు యాజమాన్యంను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళాలి. అట్ల చేయనియడల ఆక్రమణదారునికి ఎటువంటి హక్కులు వుండవు. ఎండోమెంటు పాత సెక్షన్ 38/25 రిజిస్టర్లు ప్రకారం కూడా ఒకసారి రెవెన్యూ సెటిల్ మెంట్ ఫెయిర్ అడంగల్ మతపరమైన ఆస్తిగా రికార్డుల్లో నమోదు అయితే అది ఎండోమెంటు భూమి క్రిందనే ఉంటుందని దేవదాశాఖ చట్టం స్పష్టం చేస్తుంది. దీంతో పాటు 1999 విశాఖపట్నం మున్సిపల్ సివిల్ జడ్జి కోర్టు తీర్పు వుంది. దీని ప్రకారం భూమిని వెంటనే స్వాధీనం చేసుకొని 22ఎ1 (సి) రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దీనిపై సిపిఎం గత కొంతకాలంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ వారికి పిర్యాదు చేయడంతో పాటు ఉమ్మడి జిల్లా అస్టెంటు కమీషనర్ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా అసిస్టెంటు కమీషనర్ కు పలుమార్లు పిర్యాదులు చేయడం జరిగిందని తెలిపారు. దీంతో దేవదాయశాఖ అసిస్టెంటు కమీషనర్ అనకాపల్లి వారు వారి సిబ్బందితో భూములు పరిశీలన చేసి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. కాని ఆక్రమణదారునిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. దేవాదాయ శాఖ అధికారులకు అధికార పార్టీ పెద్దలు ఒత్తుళ్లకు తలొగ్గి ఆక్రమణదారులను తొలగించలేకపోతున్నారన్నారు. ఇప్పటికే ఈ భూమి అమ్మకాలు, కొనుగోల్లో లో కోట్లాది రూపాయలు అధికార పార్టీ పెద్దల చేతులు మారాయన్నారు. అధికారం ఉంటే దేవుని భూములు కూడా అమ్మేసు కోవచ్చన్న అధికార పార్టీ పెద్దలకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించకతప్పదన్నారు. దేవదాయశాఖ అధికారులు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళుకు తలవగ్గకుండా భూమిని వెంటనే స్వాధీనం కోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు నుండి కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కాపాడాలని 22A1(C) రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది.










