Nov 17,2022 10:27

ప్రజాశక్తి-దేవరపల్లి : దేవరాపల్లి మండలం దేవరాపల్లి రెవెన్యూ సర్వే నెంబరు 20, 280/1, 281/1, 281/2 లో గల కోట్లు విలువ చేసే సుమారుగా యాబై ఎకరాలు భూమి కోర్టు వివాదంలో ఉన్న భూముల్లో పంటలు ఎవిదంగా వేస్తారని, భూములకు రక్షణ కల్పించి పంటలు వేయడాన్ని నివారించాలని కోరుతూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న ఉపముఖ్యమంత్రి బూడిముత్యాలు నాయుడుకు బహిరంగ లేఖ వ్రాసిన కాపీని గురువారం పత్రికలకు విడుదల చేశారు. అనంతరం అయిన మాట్లాడారు‌. పై సర్వే నెంబర్లు గల భూములు కోర్టు వివాదంలో యున్నవని, అయినప్పటికి ఫలసాయం తీసుకొనుటకు, కోర్టు అనుమతి పొంది ఫలసాయం తీసుకున్నారని ఫలసాయం తీసుకున్న తరువాత కోర్టు తుది తీర్పులు వచ్చేంతవరకు భూముల్లో ఎటువంటి పంటలు వేయరాదని తెలిపారు. అయినప్పటికి మరల పంటలు వేస్తున్నారని, ఇది సరియైనది కాదని తెలిపారు. సర్వే నెంబర్ 280/1 క్షత్రియ దేవిసింగ్ కు పట్టా ఇచ్చారని ఇది అన్యాక్రాంతం అయ్యిందని దీనిపై ఇతను విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ కోర్టు నందు మరియు చోడవరం సివిల్ జడ్జి కోర్టులోను కేసు వేసారనీని పేర్కొన్నారు. రెండు కోర్టుల్లోను కేసు కోట్టీ వేసిందని మరల గౌరవ హైకోర్టులో కేసు వేసారని తెలిపారు  కోర్టు నుండి తీర్పు వచ్చే వరకు భూమిలోకి వెళ్ళరాదని తెలిపారు. అయిన దేవిసింగ్ మరణించిన  ఆభూమిలో ఫల సాయం వేస్తున్నారని అన్నారు. 281/2 కూడా చోడవరం కోర్టులో కేసు వేసారు. ఇది కూడా కేసు కోట్టివేయడంతో మరల గౌరవ హైకోర్టు నందు కేసు వేసి, ఈ సర్వే నెంబరు, 281/2 ను 281/2 A గా  తప్పుడు రికార్డు సృష్టించి ఫలసాయం తీసుకోవడానికి అనుమతి తెచ్చుకోని ఫలసాయం తీసేసుకోవడం జరిగిందని, అయిన రెవెన్యూ అదికారులు కళ్ళు అప్పగించుకోని చూసారని తెలిపారు. మరల ఫలసాయం వేస్తున్నారని అన్నారు. 281/2 A అనే సర్వే నెంబర్ ఎ రెవెన్యూ రికార్డుల్లోను లేదన్నారు. అయినప్పటీకి తప్పుడు రికార్డుల స్టృష్టించి, రెవెన్యూ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నారని సర్వే నెంబరు 20 లో గల కోంత భూమి గత 30 సంవత్సరాల నుండి కోర్టు వివాదాల్లో ఉందన్నారు. ఇప్పటికే దాదాపుగా పదిసార్లు ఈ భూమి ఆక్రమణ దార్లుకు చెల్లు బాటుకాదని కోర్టులు తీర్పులు ఇచ్చిన వదిలి పెట్టకుండా కోర్టు చుట్టు రెవెన్యూ అధికారులను ప్రభుత్వాలను తిప్పుతున్నారని ఈభూములు ఆక్రమించిన వారు అందరూ వైసిపి పార్టిలో ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్నవారెనని మరియు  బందువులు ఉన్నారని తెలిపారు. అడ్డగోలుగా కోర్టు చుట్టూ రెవెన్యూ అధికారులను తిప్పుతున్నారని అక్రమంగా పంటలు వేస్తున్నారని పట్టించు కోవలసిన రెవెన్యూ అధికారులు మీకు, మీపార్టీకి భయపడి పట్టించుకోకుండా ఆక్రమణ దార్లు పట్ల ఉదారంగా వ్యవహరిస్తూన్నారన్నారు. కోర్టు వివాదంలో ఉన్న భూముల్లో పంటలు వేయడం తప్పుడు రికార్డులు స్టృష్టించి కోర్టులను ప్రజలను తప్పుదోవ పట్టించడం సరియైనది కాదని వెంటనే భూములు సరిహద్దులు, తేల్చి రక్షణ కల్పించాలి కోర్టు వివాదంలో భూముల్లో పంటలు వేయాడాన్ని వెంటనె నివారించేందుకు అదికారులకు తగు ఆదేశాలు ఇవ్వాలన్నారు.  లేనిఎడల ఆక్రమణదార్లకు ప్రభుత్వం కోమ్ముకాస్తున్నట్లు బావించవలసి వస్తుందన్నారు. చట్టాన్ని అమలు చేయవలసిన  ఉపముఖ్యమంత్రి, అధికారులు పనులకు అడ్డం పడటం సరియైనది కాదన్నారు. గతంలో ఈ భూముల్లో పంటలు తీసిన, పంటలు వేసిన కేసులు పెట్టి ఫలసాయంను వేలం వేసిన సందర్భాలు ఉన్నాయని కావున తమరు తగుచర్యలు తీసుకోని ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని లేకలో వెంకన్న కోరారు.