- రాష్ట్రంలో ఎనిమిదో విడత భూ పంపిణీ చేపట్టాలి.
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు
- వందరామన్నపాలెంలో జిల్లా భూ సదస్సు
ప్రజాశక్తి-టి.నరసాపురం : నవరత్నాల ఫథకాల్లో ధశరత్నం పధకం క్రింద భూ పంపిణీ చేర్చి రాష్ట్రంలో 8వ విడత భూపంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మక సంఘం ఆధ్వర్యంలో మండలంలోని రామన్నపాలెంలో జిల్లా సదస్సును సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. జీవరత్నం అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సు కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అసైన్డ్, సీలింగ్,1/70, 9/77 చట్టాలు పటిష్టం గా అమలు చేయాలని కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు, జీవోలు రాష్ట్ర అమలు చేయాలని డిమాండ్ చేశారు. 3వేల ఎకరాల ఎర్ర కాలువ మిగులు భూములు, దోసపాడు అసైన్డ్, సీలింగ్ భూములను పేదలకు పంచాలన్నారు. అసైన్డ్ మరియు సీలింగ్ భూములు భూమిలేని పేదలకు పంచాలన్నారు. పాత చింతలపూడి పరిదిలో ఉన్న 30వేల ఎకరాల ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పట్ల విక్ష చూపుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అసైన్డ్, సీలింగ్ ప్రభుత్వ భూములు పేదల పంచాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే పోరాటం చేస్తున్న నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సుమారు 250 కేంద్రాల్లో భూపారాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ పోరాటాల్లో భాగంగానే ఏలూరు జిల్లాలో ఎర్ర కాలవ రిజర్వాయర్ మిగులు భూములు పోరాటం, దోసపాడు భూ పోరాటం బుట్టాయిగూడెం మండలంలో ఇళ్ల స్థలాల పోరాటం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. పేదలకు చెందిన ప్రభుత్వ భూములను వెంటనే పంపిణీ చేయాలని కోరారు. మహానేత పుచ్చలపల్లి సుందరయ్య, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్లు దళితులు పేదలందరికీ భూ పంపిణీ జరగాలని కోరారు. అలాంటి నాయకుల వారసత్వాన్ని భుజాన్ని వేసుకొని వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుతుందన్నారు. నేడు ప్రభుత్వాలు భూ బ్యాంకుల పేరుతో దళితులు పేదల భూములను లాక్కొని భూస్వాములకు కట్టబెడుతుందన్నారు. పేదలకు భూ పంపిణీ చేయకపోగా తరతరాలుగా అనుభవిస్తున్న దళిత గిరిజన బలహీన వర్గాలకు చెందిన అసైన్, జరాయితి, సీలింగు ప్రభుత్వ భూములను పెత్తందారులకు, ఇస్తున్నారని తెలిపారు. అభివృద్ధి అనే ముద్దు పేరుతో పేదలకు అనుకూలంగా ఉన్న భూ సేలింగ్, అసైన్డ్, 1/77,9/77 చట్టాలు, అటవీ హక్కులు చట్టం, 2013 భూ సేకరణ చట్టాలను తుంగలోకి తొక్కి నష్టపరిహారం చెల్లించకుండా పేదలకు అన్యాయం చేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో గతంలో టిడిపి నేటి వైసిపి ప్రభుత్వాలు అదే వైకిరిని అమలు చేస్తున్నాయని విమర్శించారు. ఎక్కడైనా పేదల భూమి కోసం తిరగబడితే అక్రమంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మిగులు భూములు కోసం ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో1/70 చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. పేదల హక్కులను భంగం కలగకుండా ఎల్ టి ఆర్ భూములకు సాగు పట్టాలు ఇవ్వాలని కోరుతున్న చెవిటి వాడి ముందు శంఖం వదిలినట్లు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. తరతరాలుగా ఆదివాసీలు పోడు నరికి సాగు చేస్తున్న అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా రకరకాల సాకులు చెబుతూ దాట వేస్తున్నారని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు గోదావరిలో ముంచి నిర్వాసులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూమికి భూమి ఇవ్వడంలో పునరవాస కాలనీ కట్టడంలో, జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ.రవి,రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి టి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి ఎ.ఫ్రాన్సిస్ సిఐటియు జిల్లా నాయకులు ఆర్. వి.ఎస్ నారాయణ మాట్లాడుతూ కరోనాకాలంలో పేదలకు బ్రతుకులు లో ఆర్థిక అసమాంతలను రూపుమాపటానికి పేదలందరికీ ఉపయోగపడిన చట్టం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నేడు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. ఈ జిల్లాలో గ్రీన్ఫీల్డ్ హైవే కోసం పేద రైతులు వ్యవసాయ కార్మికులు కూలీలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న భూమికి భూమి పరిహారం ఇవ్వకుండా తాస్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ జిల్లాలో రైతులు, వ్యవసాయ కార్మికులు కార్మికులు, దళిత, గిరిజనులు ఐక్యంగా భూమి కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. టీ నర్సాపురం జంగారెడ్డిగూడెం ఏజెన్సీ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో భూమి కోసం పేదలందరూ రోడ్డెక్కి పోరాటం చేస్తుంటే ప్రభుత్వాలు మాత్రం వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. పేదలు చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. రాబోయే కాలంలో ఒక ప్రణాళిక తయారుచేసి పెద్ద ఎత్తున ఉద్యమానికి ఉధృతం చేయడానికి సిద్ధపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సదస్సులో సంఘం జిల్లా నాయకులు తుమ్మల సత్యనారాయణ, అందుగుల ప్రభాకర్, వై. సీత,డి సత్యనారాయణ తదితరులు నాయకత్వం ఉంచారు సుమారు 80 మంది ఈ సదస్సులో పాల్గొన్నారు.










