ప్రజాశక్తి-నందిగామ : వంగవీటి మోహనరంగా విగ్రహానికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించిన జనసేన నాయకులు ప్రకటించారు. ఆదివారం నందిగామ జనసేన కార్యాలయంలో వారు మాట్లాడుతూ గాంధీ సెంటర్లో ఉన్న విగ్రహాలపైనే స్టే ఉంటే వంగవీటి మోహనరంగా విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సొంత నిధులతో గాంధీ సెంటర్లో వంగవీటి మోహనరంగా విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ అనటం సంతోషంగా ఉందని కానీ ఒక పార్టీకి ఒక కులానికి ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా రంగాని పరిగణించడాన్నో ఖండిస్తున్నామని తెలిపారు. గత నాలుగు సంవత్సరాల నుంచి రంగా విగ్రహం ఏర్పాటుపై మాట్లాడని నేతలు త్వరలో రానున్న ఎన్నికల నేపథ్యంలో రంగా విగ్రహం ఏర్పాటు ప్రస్తావన తీసుకురావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. గాంధీ సెంటర్లో మొన్న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు వివిధ పార్టీల నేతలతో మరియు రాధా రంగా మిత్రమండలి, కాపు నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని , గాంధీ విగ్రహం ఏర్పాటుకి ఎలా అయితే ఫండ్స్ వసూలు చేస్తా అన్నారో అదేవిధంగా ఫండ్స్ వసూలు చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎమ్మెల్యే చెప్పిన ప్రదేశంలో పూల బండి పక్కన వంగవీటి మోహనరంగా విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జనసేన నాయకులు పూజారి రాజేష్, కౌన్సిలర్ తాటి వెంకట కృష్ణ, లక్ష్మీ పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.










