ప్రజాశక్తి-గోపాలపట్నం : గోపాలపట్నం నేతాజీ నగర్ లో దళిత కుటుంబానికి చెందిన ముక్కు సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులను కులం పేరుతో తిట్టడమే కాకుండా భౌతిక దాడి పాల్పడిన రాయుడు రమణ మరియు ఆందుకు సహకరించిన ఆరుగురు వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కెవిపిస్ నాయకులు వై రాజు మాట్లాడుతూ...40 సంవత్సరాల క్రితం నిర్మించిన కాలువ రోడ్డు శిథిల వ్యవస్థ కు చేరడంతో జీవీఎంసీ వారు ప్రారంభించడానికి శంకుస్థాపన చేయడం జరిగింది జీవీఎంసీ అధికారులతో పాటు 91 వ వార్డు కార్పొరేటర్ మామగారు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా అభ్యంతరం తెలపని వ్యక్తులు తేదీ 25.6.2023న నిర్మాణ పనులను రాయుడు రమణతో పాటు మరికొంతమంది అడ్డుకున్నారు ఇలా చేయడం సరికాదని అడిగిన ముక్కు సుబ్బారావును కుల పేరుతో తిట్టి అవమానించడం రాయుడు శ్రీను రాంబాబు రాయుడు జగదీషు పల్లికుల నూకరాజు మరియు కింది పిల్లి మనోహర్ అనబడే వ్యక్తులు సుబ్బారావు కుటుంబ సభ్యులపై భౌతికతనికి పాల్పడ్డారు. జీవీఎంసీ అధికారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గాయత్రి గారు వైయస్సార్సీపి కార్పొరేటర్ మామ బెహరా భాస్కర్ సమక్షంలో పనులు అడ్డగించిన వ్యక్తులపై ఎటువంటి చర్య తీసుకో పోవడం విచారకరం 40 సంవత్సరాల కాలం నాటి కాలువ రోడ్డు శిథిలావస్థకు చేరడంతో దాన్ని పునర్నిర్మాణం చేయవలసిన బాధ్యత జీవీఎంసీ ది. అలాగే దళిత కుటుంబం పట్ల వివక్ష జరుగుతుంటే వైఎస్సార్సీపీ కార్పొరేటర్ మరియు గోపాలపట్నం సామాజికవర్గం ఇన్చార్జ్ ఆడారి ఆనంద కుమారులు నోరు మెదపకపోవడం వైఎస్సార్సీపీకి దళితుల పట్ల ఎంత బాధ్యతారహితంగా ఉన్నారని అర్థమవుతుంది ఎప్పటికైనా కార్పొరేటర్ మరియు జీవీఎంసీ అధికారి నిలిచిపోయిన కాలువ రోడ్డు పనులు పూర్తి చేసేందుకు చర్య తీసుకోవాలి అలాగే వివక్ష పాల్పడిన వారిపై ఎస్సీ సెల్ పోలీసు వారి కేసు నమోదు చేయాలి. ఈ కార్యక్రమంలో సుబ్బారావు గారి కుటుంబ సభ్యులు కేవీపీఎస్ నాయకులు వై రాజు గారు ఈశ్వర్ రావు గారు సిహెచ్ రామారావు గారు విజయ సిఐటియు జగదాంబతోని ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి పాల్గొన్నారు