- శిశువు అపహరణ కేసును ఛేదించిన పోలీసులు
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్)లో మంగళవారం అపహరణకు గురైన శిశువును పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో పోలీసులు బుధవారం గుర్తించా రు. నిందితురాలు కంబాల లక్ష్మీ నుంచి శిశువును స్వాధీనం చేసుకుని తల్లి షేక్ రోష్నికి జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్ సమక్షం లో అదనపు ఎస్‌పి సుప్రజ అప్పగించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్తపేట పోలీసులు నాలుగు బృందాలతో జల్లెడ పట్టారు. అపహరించిన మహిళను ఉప్పలపాడుకు చెందిన కంబాల లక్ష్మీగా గుర్తించారు. ఉప్పలపాడులో వలంటీరు ద్వారా వచ్చిన సమాచారంతో పోలీసులు నిందితురాలి వివరాలను సేకరించి అదుపులోకి తీసుకున్నారు. పిల్లలులేని దంపతుల కోరిక మేరకు లక్ష్మీ గుంటూరు నుంచి శిశువును అపహరించి తీసుకెళ్లినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆమె సొమ్ము కోసం శిశువును అపహరించిందా? సాయం చేయాలనే ఆలోచన ఉందా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలు కంబాల లక్ష్మీతోపాటు పిల్లలు లేని దంపతులనూ పోలీసులు విచారిస్తున్నారు. కొత్తపేట సిఐ










