Jul 26,2023 11:44

ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్ : మచిలీపట్నంలో ఓ ప్రముఖ వైద్యురాలిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. స్థానిక జవ్వారుపేటలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు డా.మాచర్ల రాధా జవారుపేటలోని తల్లి పిల్లల ఆసుపత్రిలో పిల్లల వైద్యురాలు. భర్త ఉమామహేశ్వరరావు, భార్యాభర్తలు ఇరువురు తల్లి పిల్లల ఆసుపత్రి నడుపుతున్నారు. యధావిధిగా మంగళవారం సాయంత్రం గ్రౌండ్ ఫ్లోర్లోని క్లినిక్ కు వెళ్లిన భర్త ఉమామహేశ్వరరావు. రాత్రి 11 గంటల సమయంలో ఎన్నిసార్లు ఫోన్ చేసినా డాక్టర్ రాధా స్పందించక పోవడంతో అనుమానం వచ్చి పైకి వెళ్లి చూడగా భార్య రాధ రక్తపు మడుగులో పడి ఉందని, వెంటనే పోలీసులకు భర్త సమాచారం అందించారు. విషయం తెలుసుకుని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న బందర్ డిఎస్పి మాధవరెడ్డి, ఇనగుదురుపేట సిఐ ఉమామహేశ్వరరావు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది. డాక్టర్ రాధను హత్య చేసి నగలను దుండగులు వలుచుకు వెళ్లినట్లు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే తెలుస్తోంది. భర్త నుండి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.