ప్రజాశక్తి-విజయనగరం కోట : స్థానిక వీటి అగ్రహారం 35వ డివిజన్ పరిధిలో ఇండస్ట్రియల్ ఏరియాలో ప్లాస్టిక్ కంపెనీలో అర్ధరాత్రి ఓ వ్యక్తి హత్యకు గురైయ్యాడు. శనివారం నాడు స్థానిక వీటి అగ్రహారంలో ఒక ప్రైవేట్ ప్లాస్టిక్ కంపెనీలో శుక్రవారం అర్ధరాత్రి మర్డర్ జరిగినట్లు గుర్తించిన రూరల్ పోలీసులు. వివరాలకు వెళ్తే స్థానిక బంటుపల్లి అప్పలనాయుడు(71, అచ్చన్న కుమారుడు) ప్లాస్టిక్ కంపెనీలో గత కొంతకాలంగా వాచ్మెన్ గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే శుక్రవారం నాడు రాత్రి అదే కంపెనీలో పనిచేస్తున్న బీహార్ ప్రాంతానికి చెందిన కొనాల్ (35) అనే వ్యక్తి సుమారు రాత్రి 9:30 ప్రాంతంలో మిషన్ కు ఉన్న కటింగ్ బ్లేడ్లు అమ్ముకోవడానికి బయటకు పట్టుకుని వెళ్తుంటే వాచ్మెన్ అయిన అప్పలనాయుడు పట్టుకొనగా ఆయన్ని గుద్ది బ్లెడ్లు పట్టుకెళ్ళిపోవడం జరిగింది. ఇదే విషయాన్ని అక్కడ ఉన్న ఇతర పనివాళ్ళు శ్రీను పక్క కంపెనీలో ఉన్న వాచ్మెన్ కి చెప్పగా వారి సహాయంతో ఇంటికి కబురు చేస్తే వాళ్ళ భార్య, పిల్లలు వచ్చారు. అప్పలనాయుడుకు రక్తం కారుతూ ఉంటే కట్టుకట్టి 'కొనాల్ ని మీరు ఏమి అనకండి' అని చెప్పి భార్య,పిల్లలు ఇంటికి వెళ్లిపోయారు. అయితే తెల్లవారి శనివారం ఉదయం 6:00కి శ్రీను, ఆయన పనివాడు వచ్చి గేట్లు కొడుతుంటే తలుపులు తెరవకపోయేసరికి ఏమైందో అని చూద్దామని గోడపైకి ఎక్కి చూసేసరికి రక్తం మడుగుల్లో పడి ఉన్న అప్పలనాయుడు చూశారు. వెంటనే ఆయన సహ ఉద్యోగులకి ఫోన్ చేసి చెప్పి వారి కుటుంబ సభ్యులకు, పోలీస్ వారికి సమాచారం ఇచ్చారు. విని వెంటనే రూరల్ పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి, నమూనాలు సహకరించి పరీక్షలకు పంపించారు. మృతదేహాన్ని బయటికి తీసుకెళ్లకుండా కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు గేటు వద్ద అడ్డుకున్నారు. ఈ కంపెనీ ఓనర్లు గౌతం, రాము అందుబాటులో లేకపోవడంతో పోలీసు వారు వారికి ఫోన్ చేసి రమ్మని తెలిపారు. అప్పలనాయుడు బార్య యశోద, కుమారుడు తరుణ్ కలరు.