తిరువనంతపురం : ఏకరూప పౌరస్మృతి చట్టం (యుసిసి)కి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ మంగళవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. షెడ్యూల్ ప్రకారం.. కేరళ ముఖ్యమంత్రి పిపరయి విజయన్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ రెండూ కూడా యుసిసిని వ్యతిరేకిస్తున్నందున అసెంబ్లీలో ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందే అవకాశం ఉంది. యుసిసికి వ్యతిరేకంగా ప్రచారంలో భాగంగా సిపిఎం మరియు కాంగ్రెస్‌లు ఇప్పటికే అనేక సెమినార్లు మరియు సమావేశాలను నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సిఎఎ, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కూడా కేరళ అసెంబ్లీ తీర్మానాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2020 జనవరిలో సిఎఎకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రం కేరళనే.