May 14,2023 12:43

మెరిసేదంతా బంగారం కానట్లే,
కురిసే నీరంతా ఉపయోగపడదు అన్న చందాన..
మేడి పండులా గోచరించే మానవులు,
కూడి ఉండాలనే బుద్ధి ఉండని మనుజులు..
లోకంలో ఎక్కువైపోయారు నేడు
లోకాన్ని సైతం శాసిస్తున్నారు చూడు!

తోడబుట్టిన వారంటే ఏదో..
చులకన భావం వీరికి,
తోడబుట్టిన కుటుంబసభ్యులంటే
ఏదో.. నూన్యతా భావం వీరందరికి!

అవసరం వున్నప్పుడే కల్గుతాయి
వీరికి ప్రేమలు..
ఆ అవసరం తీరాక హెచ్చు మీరుతాయి
వీరికి ఈర్షా ద్వేషాలు!

తోటి వారిని మోసగించడం
వీరికున్న ప్రథమ లక్షణం..
నీతులు చెపుతూ సత్యవంతులం
అన్న భ్రమ కల్పించడం వీరి నైజం!

నమ్మినవారిని నట్టేట ముంచటం
వీరికున్న రోగం..
అయిన వారికి ద్రోహం తలపెట్టడం
వీరికి ఎంతో సంతోషం!

తోటివారికి సహాయం చేసే అవకాశం ఉన్నా
ఆ అంశానికి తావివ్వరు వీరు..
ఉపకారం చేయు సదవకాశం
ఉన్నా ఎలాంటి సహకారం అందించరు వీరు!

ఆత్మీయత అనురాగాలకు
అల్లంత దూరం వీరు..
బంధం అనుబంధాలకు
ఊసే ఎత్తని స్వార్థ పరులు వీరు!

నా అని అనుకున్నవాళ్ళు నా వాళ్ళు
కాలేరు అని ఇప్పుడే తెలిసింది నాకు.!
నా వారు కాని వారిని ఇన్నేళ్లు
నావారు అనుకుని మోసపోయానని తెలిసింది నాకు.!!
ఎన్‌.రాజేష్‌
9849335757