Jan 12,2023 18:16

ప్రజాశక్తి-అమరావతి : ఎనిమిదేళ్లుగా రావి రంగారావు సాహిత్య పీఠం నిర్వహిస్తున్న ''జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు (2022) ఫలితాలు ప్రకటించారు. ఈ ఏడాది అందిన 81 పుస్తకాలలో ఆరు పుస్తకాలకు పురస్కారాలు అందజేస్తున్నారు. 1. అరిసేతిలో బువ్వ పువ్వు (వచన కవితలు) - చింతా అప్పలనాయుడు (పార్వతీపురం, మన్యం జిల్లా), 2. ఎగురుతున్న పద్యం (వచన కవితలు) - అవ్వారు శ్రీధర్‌ బాబు (నెల్లూరు), 3. కల్లంచుల బువ్వ (దీర్ఘ వచన కవిత) - ఈ. రాఘవేంద్ర (రాయదుర్గం, అనంతపురం జిల్లా), 4. సమీకరణం (వచన కవితలు) - డా. భూసురపల్లి వెంకటేశ్వర్లు (గుంటూరు), 5. మువ్వ (పద్య కవితలు) - బులుసు వెంకటేశ్వర్లు (చిట్టి వలస, విశాఖ జిల్లా),6. చినుకు తాకిన నేల (వచన కవితలు) - శాంతి కృష్ణ (హైదరాబాద్‌). పురస్కార గ్రహితలకు గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళా వేదికపై ఫిబ్రవరి 9 గురువారం సాయంత్రం 6 గంటలకు జరిగే సభలో సత్కారం ఉంటుంది. ఈ సభకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ప్రాచార్యులు గుజ్జర్లమూడి కపాచారి, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ పూర్వ సభ్యులు గుత్తికొండ సుబ్బారావు, ప్రముఖ సాహితీ విమర్శకులు డా. గుమ్మా సాంబశివరావు, డా. వేలువోలు నాగరాజ్యలక్ష్మి మొదలైన అతిథులు పాల్గొంటారు.