నీకు ఏది కావాలో ఎరుక కలిగి
ఉన్నావట కదా?
రేపు, ఎల్లుండి, వచ్చే ఏడాది..
ఏమేమి చెయ్యాలో ప్రణాళికలు వేసి
పెట్టుకున్నావట కదా?
సంక్లిష్టమైన దారుల నడుమ
నీవు వెళ్ళవలసిన దారి
ఏదన్న గ్రహింపు
కలిగి ఉన్నావట కదా!
నమ్మకద్రోహం లేదా
బాధ్యతారాహిత్యం..
రెండింటిలో ఏదో ఒకటి
ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు
మూడవదానిగా ఒకటి ఎంచుకోవడం
నీకు సాధ్యమయ్యిందట కదా!
తరువాత చదవాల్సిన పుస్తకం,
వ్రాయాల్సిన కవిత
స్వాధీనం చేసుకోవాలనుకున్న కోట..
అన్నింటిలోనూ తీర్మానంగా ఉన్నావట కదా!
ప్రశ్నలు, చిక్కు ప్రశ్నలు అంటూ
అలసట కలిగించే దైనందిన జీవితంలో కూడా
సడలి పోకుండా చిక్కుముడులు విప్పి జవాబులు తెలుసుకుంటున్నావట కదా! మిత్రమా!
నిన్న రాత్రి కూడా నిద్ర పోయావట కదా!?
తమిళ మూలం : మధువంతి
అనువాదం: గౌరీ కృపానందన్
97910 69485