May 14,2023 12:49

గగనమున
సంతకం చేసినట్టు
వరుసలలో
పక్షుల గమనం

ఓడిపోయావా ?
కలత చెందకు
గెలుపుకి అదే
నాందీ ప్రస్థానం


చందమామ
పిండి ఆరబోసింది
ఆ రోజు
నిండు పౌర్ణమి మరి!

కవిత్వం
కలం కొనల నుండి కాదు
గుండె కొలను నుండి
పుట్టాలి

సంద్రం
ఆటు, పోటులు కొత్తేమి కాదు
జీవితంలో
ఆటు, పోటుల కన్నానా

కోయిలమ్మ
కమ్మని పాట కచేరి
వేదిక
కాకుల గూడు
కయ్యూరు బాలసుబ్రమణ్యం
94417912