Nov 16,2020 09:37

లండన్‌ : కరోనా సోకిన వ్యక్తితో సంప్రదింపులు జరపడంతో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మరోసారి క్వారంటైన్‌కు వెళ్లారు. ఇటీవల కరోనా పాజిటివ్‌ వ్యక్తిని జాన్సన్‌ కలిశారని, దీంతో రెండవసారి ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కరోనా రోగి కలిసినందున ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్వీయనిర్బంధంలో ఉంటారని డౌనింగ్‌ స్ట్రీట్‌ ప్రతినిధి ప్రకటించారు. అయితే ప్రధానిలో కరోనా లక్షణాలు లేవని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని డౌనింగ్‌ స్ట్రీట్‌ ప్రతినిధి చెప్పారు. ప్రధాని జాన్సన్‌ గురువారం డౌనింగ్‌ స్ట్రీట్‌ లో చట్టసభ సభ్యుల బఅందాన్ని కలిశారు. ప్రధానిని కలిసిన వారిలో కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుడు లీ అండర్సన్‌ కూడా ఉన్నారు. అనంతరం లీ అండర్సన్‌ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో .. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా అప్రమత్తమై నిర్బంధంలోకి వెళ్లారని అన్నారు. బోరిస్‌ జాన్సన్‌ కు మార్చి నెలలో కరోనా వైరస్‌ సోకిన సంగతి తెలిసిందే. కాగా, బ్రిటన్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల మూడంచెల లాక్‌డౌన్‌ను విధించింది. 1.3 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 50వేలమంది మరణించారు.